ఈ నెల అంటే 2022 జనవరి లో STRADA PAINTING AND DRAWING CHALLENGE లో పాల్గొన్నాను .ఈ జనవరి నెలంతా ప్రతి రోజూ LIFE నుంచి వర్క్ చేసి రోజూ పోస్ట్ చేయాలి . still life కానీ landscape కానీ DRAWING కానీ LIFE నుంచే వేయాలి . ప్రతి సంవత్సరం జనవరిలో సెప్టెంబర్లో ఈ challenge ఉంటుంది. ఈ challengeలో సాధించినవారికి వాళ్ళకి STRADA కంపెనీ easels ఇస్తారట . ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిస్టులు పాల్గొంటుంటారు .
జనవరి ఒకటిన నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ,ఏదో స్పెషల్ వండుకుంటూ గడిచిపోతుంది కదా వర్క్ ఎలా చేస్తాను అనుకుంటూనే పొద్దున్నే ఎనిమిది గంటలకంతా స్టూడియోకి వెళ్ళిపోయి పని మొదలు పెట్టా . నూల్ కోల్ వంటింట్లో ఉన్నింది. దానిని compose చేసుకొని డ్రాయింగ్,పెయింటింగ్ మొదలు పెట్టా . రెండున్నర గంటలకంతా పూర్తయ్యింది . పదకొండు గంటలకంతా స్టూడియో నుంచి బయటపడ్డా . ఆశ్చర్యం నాకు నాకే . వేసేసానే అని . తక్కువ రంగులు .అంటే నూల్ కోల్ ని పెయింట్ చేయాలంటే ఒక్క green లోనే వాల్యూస్ అనేకం చూపించాలి కనుక త్వరగా పని జరిగింది అని అర్థమయ్యింది . రెండో రోజు డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నా .అదీ అంతే ఒకటే రంగు . లోకల్ కలర్ తీసుకుని అందులోనే అనేక values ని వర్క్ చేసాను . తరువాత గన్నేరు. అది రెండు రోజులు తీసుకున్నాఅలా కొన్ని స్టిల్ లైఫ్ వర్క్స్,కొన్ని డ్రాయింగ్స్ వేసాను . అనారోగ్య కారణాలతో challenge పూర్తి చేయలేక లేకపోయాను . అయినా
ఈ పదహైదు రోజులు రోజూ లైఫ్ నుంచి పని చేయటం ద్వారా అర్థమయ్యింది ఏమంటే ….
– మొదలు పెట్టాలి అంతే అల్లుకు పోతూ ఉంటుంది ఆ పని అని..
– ఎంత సమయం తక్కువ ఉన్నాఎన్ని పనులున్నా మనం చేయాలనుకుంటే చేయచ్చు అని ,దాన్ని ఇతరులు కూడా గౌరవిస్తారు అని..
– సబ్జెక్టు సెలెక్ట్ చేసుకోవటం ,COMPOSITION పైన కూడా సమయం వృధా చేసాను ఇన్నిరోజులు అని..
– ఇలాంటి CHALLENGES లో పాల్గొనటం ద్వారా మనలో చాలా శక్తి ఉందని అర్థమవుతుందని ..
– ఇతర ప్రపంచ ఆర్టిస్టులు ఎలాంటి బొమ్మలు వేస్తున్నారు ,వాళ్ళు ఎలాంటి సబ్జెక్టు తీసుకుంటున్నారు, వాల్ల ENERGIES ఎలా ఉన్నాయి చూడటం సాధ్యమవుతుందని ..
-మనం వాళ్ళని ఫేస్బుక్,ఇంస్టాగ్రామ్ ద్వారా FALLOW అవటంవలన అనేకవిషయాలు చర్చించవచ్చు మెటీరియల్ ,టెక్నిక్ లాంటివి అని..
– మన దగ్గర చాల పెయింటింగ్స్ ఉండడంతో మనం చాల RICH గా ఫీల్ అవతామని.
నేను వేసిన కొన్ని పెయింటింగ్స్ మీ కోసం ! ఇందులో నచ్చినవి మీరు కొనవచ్చు . అతి తక్కువ ధరలకే లభిస్తాయి . కావాలనుకున్నవాళ్లు bkiran38@gmail.com కి మెయిల్ చేయండి. ముందస్తు కృతజ్ఞతలు !