my work @ STRADA CHALLENGE

             my work @ STRADA  PAINTING AND DRAWING CHALLENGE

                    ఈ నెల అంటే 2022 జనవరి లో STRADA  PAINTING AND DRAWING CHALLENGE  లో పాల్గొన్నాను .ఈ జనవరి నెలంతా ప్రతి రోజూ  LIFE  నుంచి వర్క్ చేసి రోజూ  పోస్ట్ చేయాలి . still life కానీ landscape  కానీ DRAWING  కానీ LIFE  నుంచే వేయాలి . ప్రతి సంవత్సరం జనవరిలో సెప్టెంబర్లో ఈ challenge  ఉంటుంది. ఈ  challenge  లో సాధించినవారికి వాళ్ళకి  STRADA కంపెనీ easels  ఇస్తారట . ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిస్టులు పాల్గొంటుంటారు . 

                 జనవరి ఒకటిన  నూతన సంవత్సర శుభాకాంక్షలు  చెప్పుకుంటూ,ఏదో స్పెషల్ వండుకుంటూ  గడిచిపోతుంది కదా  వర్క్ ఎలా చేస్తాను అనుకుంటూనే పొద్దున్నే ఎనిమిది  గంటలకంతా స్టూడియోకి వెళ్ళిపోయి పని మొదలు పెట్టా . నూల్ కోల్  వంటింట్లో  ఉన్నింది.  దానిని compose చేసుకొని డ్రాయింగ్,పెయింటింగ్ మొదలు పెట్టా . రెండున్నర గంటలకంతా పూర్తయ్యింది . పదకొండు గంటలకంతా స్టూడియో నుంచి బయటపడ్డా . ఆశ్చర్యం నాకు నాకే . వేసేసానే అని . తక్కువ రంగులు .అంటే నూల్ కోల్ ని పెయింట్ చేయాలంటే  ఒక్క green లోనే వాల్యూస్ అనేకం చూపించాలి కనుక త్వరగా పని జరిగింది అని అర్థమయ్యింది . రెండో రోజు డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నా .అదీ అంతే ఒకటే రంగు . లోకల్ కలర్ తీసుకుని అందులోనే అనేక values ని వర్క్ చేసాను . తరువాత గన్నేరు. అది రెండు రోజులు తీసుకున్నాఅలా కొన్ని స్టిల్ లైఫ్ వర్క్స్,కొన్ని డ్రాయింగ్స్ వేసాను . అనారోగ్య కారణాలతో   challenge   పూర్తి చేయలేక లేకపోయాను . అయినా


ఈ పదహైదు రోజులు రోజూ లైఫ్ నుంచి పని  చేయటం ద్వారా  అర్థమయ్యింది ఏమంటే ….
 
– మొదలు పెట్టాలి అంతే అల్లుకు పోతూ ఉంటుంది ఆ పని అని.. 
– ఎంత సమయం తక్కువ ఉన్నాఎన్ని పనులున్నా మనం చేయాలనుకుంటే చేయచ్చు అని ,దాన్ని ఇతరులు కూడా గౌరవిస్తారు అని..  
– సబ్జెక్టు సెలెక్ట్ చేసుకోవటం  ,COMPOSITION పైన కూడా సమయం వృధా చేసాను ఇన్నిరోజులు అని..  
– ఇలాంటి CHALLENGES లో  పాల్గొనటం ద్వారా మనలో చాలా  శక్తి  ఉందని అర్థమవుతుందని ..  
– ఇతర ప్రపంచ ఆర్టిస్టులు ఎలాంటి బొమ్మలు వేస్తున్నారు ,వాళ్ళు ఎలాంటి సబ్జెక్టు తీసుకుంటున్నారు, వాల్ల  ENERGIES ఎలా ఉన్నాయి చూడటం సాధ్యమవుతుందని ..  
-మనం వాళ్ళని ఫేస్బుక్,ఇంస్టాగ్రామ్ ద్వారా FALLOW  అవటంవలన  అనేకవిషయాలు చర్చించవచ్చు మెటీరియల్ ,టెక్నిక్ లాంటివి అని.. 
– మన దగ్గర చాల పెయింటింగ్స్ ఉండడంతో మనం చాల RICH గా ఫీల్ అవతామని.
                                        

                                                  

Ganneru flowers,8×10”,oils
Garlic,8×10”,oils
Dragon fruit,8×10”,oils
Noolkol,8×10”,oils
Ganesh,8×10”,oils
Pink flowers,8×10”,oils

 

Pears,8×10”,oils

నేను వేసిన కొన్ని పెయింటింగ్స్ మీ కోసం ! ఇందులో నచ్చినవి మీరు కొనవచ్చు . అతి తక్కువ ధరలకే లభిస్తాయి . కావాలనుకున్నవాళ్లు bkiran38@gmail.com కి మెయిల్ చేయండి. ముందస్తు కృతజ్ఞతలు !   

Working on Roses!

       

orange rose,10×12”,oils,2021

 ఈ మధ్యలో  నేను ఆరు వారాల పాటు జరిగిన Winter Roses Online Painting Workshop  లో చేరాను .UK కిచెందిన Artist ,Art teacher అయిన Paul Foxton శిక్షణ ఇచ్చారు . మామూలుగా Continue reading “Working on Roses!”

some useful websites which I follow!

నేను నేర్చుకొనే ఉపయోగపడే కొన్ని websites !
 మనకు  కావాల్సిన అంశాలపై   ఉచితంగా సమాచారాన్నిఇచ్చే, గైడ్ చేసే అనేక  site లు internet లో దొరుకుతాయి . కాకపోతే సరైన,ఖచ్చితమైన సమాచారం ఇచ్చే వాళ్లై ఉండాలి . అందుకని కొద్ధి మంది నమ్మకమున్న ఆర్టిస్టులు ,రచయితలు,స్నేహితులు   చెప్పిన site లను చూడడం, నాకు అనుకూలంగా ,ఆసక్తి గా ,ఉపయోగంగా ఉన్న వాటిని కంటిన్యూ చేయడం చేస్తాను ,అలా చాలా రోజులుగా నేను ఫాలో అవుతున్న వాటిని మీకు కూడా పరిచయం చేస్తాను 

Continue reading “some useful websites which I follow!”

Value study-2

Value balance లేక value relationship ను అర్థం చేసుకోటానికి   ఆర్టిస్టులు   Cubes ,spheres ను ఉపయోగించి అనేక అభ్యాసాలు చేస్తారు . నేను కూడా అదే చేసాను . Continue reading “Value study-2”