Value study-1

Value scale 

నేను తెలుసుకున్నvalue study గురించి ఇక్కడ కొద్ధి మేరకు చెబుతాను. 
మాములుగా Hue ,Value ,Chroma గురించి  కొంత అర్థం చేసుకోవాలి . 
 

The Hueఅంటే రంగుపేరు ,నీలిరంగు,ఎరుపురంగు,పసుపురంగు ఇలా.

The Value అంటే  ఎంత dark గా ఉంది ఎంత light గా  ఉంది ఆ రంగు అనేది.

The Chroma అంటే ఆ రంగు ఎంత బలంగా ప్రభావితంగా  ఉంది ఎంత బలహీనంగా ఉంది అంటే   intensity of color గురించి చెప్పటం. A low  intensity రంగు అంటే grey కి దగ్గరగా ఉండటం,neutral కి దగ్గరగా ఉండటం  A high intensity color అంటే  చాల strong గా pure గా ఉండటం .

                రియలిస్టిక్  బొమ్మలు వేసేటప్పుడు valuesని సరిగ్గా  వేయడంలోనే తప్పులు ఎక్కువ జరుగుతుంటాయి.ఒక బొమ్మలో అంటే portraits కానీ ,landscapes కానీ వేసేటప్పుడు depth ని ,three dimensionality  ని తీసుకురావాలంటే values ద్వారానే సాధ్యపడుతుంది . మాస్టర్ ఆర్టిస్టులు వాళ్ళ చూపు ,focus మెరుగు పరుచుకోటానికి ఈ అభ్యాసాన్నిమధ్య మధ్యలో చేస్తూనే ఉంటారు . 
              నేను కూడా చాలా రోజులు దీన్ని అర్థం చేసుకోను కష్టపడ్డాను . valuesని అర్థం చేసుకోను  ఫండమెంటల్స్ దగ్గరనుంచి ప్రాక్టీస్ చేయాలి. white నుంచి black వరకు ఉన్నvalues ని చూడగలగాలి .అంటే light to dark మధ్యలో ఉన్నషేడ్స్ ని చూడటం . మొదట పెన్సిల్తో  value scale ని ప్రాక్టీస్ చేయాలి. Value scale ఒక క్రమ పద్దతిలోvalues ని అంటే shades ని చూడటం నేర్పిస్తుంది . రంగులతో బొమ్మలు వేసేటపుడు  ఈ స్టడీ ఎంతగానో ఉపయోగ పడుతుంది . 
             మొదట మూడు values అంటే black ,mid gray ,white ని ప్రాక్టీస్ చేయాలి . తర్వాత ఐదు values ,తర్వాత తొమ్మిది values చేయాలి. ఇది చాలా simple గా  కనిపిస్తుంది.  కానీ చాలా ధ్యానంతో నెమ్మదిగా కావాలంటే రోజుకు ఒక block మాత్రమే నింపుతూ పని చేయాలి .హడావుడిగా speed గా చేయకూడదు texture లు లేకుండా smooth గా టోన్ ఉండాలి . అప్పుడే ప్రతి step లో values ని కరెక్ట్ గా అంచనా వేయగలము , soft pencil  2B, hard pencil 2h తో కానీ    , 6B,B,H,3H  పెన్సిళ్ళతో కానీ పని చేయచ్చు. శ్రద్ద ,నేర్చుకోవాలన్న తపన ఉంటే రకరకాల పెన్సిళ్ళతో ,ఇతర mediums తో కూడా ఈ అభ్యాసం చేయ వచ్చు .
               బొమ్మల విషయంలో మనం చూసే చూపు మారాలన్నా ,focus దెబ్బ తిన్నా  మళ్ళీ మళ్ళీ ఈ అభ్యాసంచేయాల్సి ఉంటుంది . కింద ఇచ్చిన కొన్ని లింక్స్ లో ఈ ఎక్సరసైజ్ ఎలా చేస్తారో చూడచ్చు .
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

My journey with school children-2

 

స్కూలు పిల్లలతో నా అనుభవాలు – 2

గతవిద్యా సంవత్సరం “పిల్లలతో కథల-బొమ్మల ప్రయాణం”అనుభవాలు పంచుకున్నాను . 

(చూడని వారు పిల్లలతో నా ప్రయాణం లో చదవచ్చు )
 
              ఈ విద్యా  సంవత్సరంలో కూడా  స్కూల్ పిల్లలకు కథలు చెప్పటం,బొమ్మలు వేయించడం తో పాటు  పిల్లల కథల పుస్తకాల సేకరణపై   దృష్టి పెట్టాను . 

Continue reading “My journey with school children-2”

About oil painting brushes

పెయింట్ బ్రష్ లు – కథాకమీషు
 
   Click for English version#A while ago
        చాలా సార్లు కొన్ని పెయింటింగ్స్  చూడగానే మంచి బ్రష్ లు వీళ్ళు వాడలేదు అని తెలిసిపోతుంది . బ్రష్ ల గురించి కాస్త అవగాహన ఉండటం, ఎలాంటి వర్క్ కి ఏ రకం బ్రష్ ఉపయోగపడుతుందో గ్రహించటం ముఖ్యం . Oil paint బ్రష్ ల గురించి నెట్లో చదివినవి  ,ఆర్టిస్ట్ group ల చర్చల నుంచి అప్పుడప్పుడు  నేను రాసుకున్న నోట్స్ ని మీతో పంచుకుంటున్నా !
పెయింట్ బ్రష్ లను  మూడు భాగాలుగా చూడచ్చు !

Continue reading “About oil painting brushes”

Still life art work in oils-Pears

    
    Pears,6×8 inches,Oils on paper
                  
                 దాదాపు మూడు నెలల నుంచి నేను ఏ పోస్ట్ పెట్టలేదు . ఊర్లో లేకపోవటం ఒక కారణమైతే కొన్ని నెలలు ప్రాక్టీస్ వదిలామంటే మల్లీ మొదలు పెట్టను చాలా సమయం తీసుకుంటుంది . ఒక క్రమ పద్దతిలో పనిచేయను మనసు శరీరాలు తొందరగా ఒప్పుకోవు . మొదట రోజూ కొన్ని డ్రాయింగ్ అభ్యాసాలు చేయటం,సంబంధిత వీడియోలు చూడటం ,నేను అనుసరించే ఆర్ట్ బ్లాగ్స్ చదవటం చేసాను.అంతే కాక పెయింటింగ్ మొదలు పెట్టటానికి ఎప్పుడూ ధైర్యం సరిపోదు. సరిగ్గా రాక మధ్యలో ఆపేస్తానేమోనన్న సందిగ్ధంతో సబ్జెక్టును తెచ్చుకోటం ,compose చేసుకోవటం జరుగుతూ ఉంటుంది . అలా బజారుకి పోయినపుడు బొమ్మ వేయటానికి తెచ్చుకున్న బేరి కాయలు (Pears)ఇవి .
                పని మొదలు పెట్టాను.వేసేటపుడు వర్షం కారణంగా daylight డల్ అయ్యింది.ఆ పండు texture,sharp edges తేవటానికి కష్టపడాల్సి వచ్చింది. 

My journey with school children! Art&story telling to children

పిల్లలతో కథల – బొమ్మల ప్రయాణం – 1

Click here to English version

                 నా మనవరాలికి కథలు చెప్పేదాన్ని.ఈ కథలు వేరే పిల్లలకు కూడా చెబితే బాగుంటుంది కదా అని మా ఇంటి వెనుక ఉండే మున్సిపల్ స్కూల్కి వెళ్లి పిల్లలకు కథలు చెబుతాను వారానికి ఒక గంట టైం ఇవ్వండి అని అడిగాను .అక్కడి హెల్డ్మాస్టర్ మొదట పై అధికారుల పర్మిషన్ లు కావాలి మళ్ళీ రండని పంపించివేశారు. సరే ఇలా కాదు అని కథలు వినడం వల్ల కలిగే ప్రయోజనాలు,ఎలాంటి కథలు చెప్పాలనుకుంటున్నాను అనే విషయాలు వివరంగా రాసి ఒక అప్లికేషన్ లా , నా బయోడేటాని చేర్చి మల్లీ పోయి ఇచ్చాను. దాంతో ఏమనుకున్నాడో ఏమో సరే అనేశాడు . అక్కడి నుంచి కథలు మొదలయ్యాయి . Continue reading “My journey with school children! Art&story telling to children”