Value study-2

Value balance లేక value relationship ను అర్థం చేసుకోటానికి   ఆర్టిస్టులు   Cubes ,spheres ను ఉపయోగించి అనేక అభ్యాసాలు చేస్తారు . నేను కూడా అదే చేసాను .

ఇక్కడ నేను white  ,gray , black లో cubes ,spheres  తీసుకున్నాను . (బజార్లో అమ్మే చౌకగా దొరికే ప్లాస్టిక్ బాల్స్ కి తెలుపు, నలుపు, గ్రే రంగులు వేసుకున్నా.చెక్కపని చేసేవాళ్ళనడిగి రెండు ఇంచుల పొడవు వెడల్పు కల cubes ని చెక్కతో చేయించుకున్నా. ఆర్ట్ మెటీరియల్ అమ్మే షాప్ లలో కూడా అడగచ్చు )

వెనుక అంటే బ్యాక్ గ్రౌండ్ నలుపు రంగులో  ,కింద అంటే  బేస్ grey రంగు లో( ఆ రంగు వేసిన అట్టలు ) అమర్చుకొని ఈ spheres ని,cubes ని  ఆయిల్స్  తో పెయింట్ చేసాను . 
 
మామూలుగా cubes ,sphere యొక్క values ని అర్థం చేసుకోవాలంటే light  ఎలా పడుతోందో గమనించాలి . అలాచూసినపుడు light values ,mid tone values,shadow values కనిపిస్తాయి .
 
అవి cube లో 
 light side
 topsurface
 shadowside
cast shadow
 
అవి sphere లో
High light,
Center light ,
Half tone,
Core shadow,
Cast shadow ,
Reflected light ,
Occlusion shadow గా చెప్పుకుంటాము . 
 
వీటిని  కరెక్టుగా value scale ఆధారంగా రంగులు కలపటం ఒక ఎత్తు అయితే వాటిని సరిగ్గా పక్కపక్కనే ఆ values కనిపించేటట్టు  పెయింట్   చేయడం ,అలాగే ఒక value నుంచి ఇంకో value కి మారేటపుడు జాగ్రత్తగా merge చేయడం చేయాలి . ఇది అర్థమయిన తరువాత రంగులలో కూడా ఈ values ని అర్థం చేసుకోవాలి . 
 
ఇది క్రమశిక్షణ తో కూడిన అభ్యాసం పైనే వస్తుంది .
ఆలా  value balance  ,Value relationship  ని  study చేసి బొమ్మ వేసినపుడు అది ఒక మంచి బొమ్మగా నిలబడుతుంది . 
ఈ అభ్యాసాలు  సరిగ్గా చేయగలిగితే stilllife , potraits ,landscape paintings సులభమవుతాయి