బొమ్మలు వేయటం నేర్చుకోవటం అంటే సరిగ్గా చూడటం నేర్చుకోవడమే !
ఏ కళ కైనా basic fundamentals నేర్చుకోవడం చాలా ముఖ్యం . నేను portraits వేసేటప్పుడు చాలా రోజులు అనాటమీ ప్రాక్టీస్ చేసే దాన్ని. అలాగే city scapes వేసే టపుడు పర్స్పెక్టివ్ గురించి స్టడీ చేసాను. కలర్ గురించి నేర్చుకోవాలనుకున్నపుడు values , munsell color chartను ప్రాక్టీస్ చేసాను. ఇవన్నీ మళ్ళీ మళ్లీ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను.
బొమ్మలు వేయటం నేర్చుకోవటం అంటే సరిగ్గా చూడటం నేర్చుకోవడమే ! చూడటం అంటే accurate గా చూడటం. “Educate the eye before you educate the hand. The hand will become cunning soon enough when the eye has learned to see, whereas if the hand be educated before the eye one may never see.” -Carolus-Duran(1880)