Pears,6×8 inches,Oils on paper
దాదాపు మూడు నెలల నుంచి నేను ఏ పోస్ట్ పెట్టలేదు . ఊర్లో లేకపోవటం ఒక కారణమైతే కొన్ని నెలలు ప్రాక్టీస్ వదిలామంటే మల్లీ మొదలు పెట్టను చాలా సమయం తీసుకుంటుంది . ఒక క్రమ పద్దతిలో పనిచేయను మనసు శరీరాలు తొందరగా ఒప్పుకోవు . మొదట రోజూ కొన్ని డ్రాయింగ్ అభ్యాసాలు చేయటం,సంబంధిత వీడియోలు చూడటం ,నేను అనుసరించే ఆర్ట్ బ్లాగ్స్ చదవటం చేసాను.అంతే కాక పెయింటింగ్ మొదలు పెట్టటానికి ఎప్పుడూ ధైర్యం సరిపోదు. సరిగ్గా రాక మధ్యలో ఆపేస్తానేమోనన్న సందిగ్ధంతో సబ్జెక్టును తెచ్చుకోటం ,compose చేసుకోవటం జరుగుతూ ఉంటుంది . అలా బజారుకి పోయినపుడు బొమ్మ వేయటానికి తెచ్చుకున్న బేరి కాయలు (Pears)ఇవి .
పని మొదలు పెట్టాను.వేసేటపుడు వర్షం కారణంగా daylight డల్ అయ్యింది.ఆ పండు texture,sharp edges తేవటానికి కష్టపడాల్సి వచ్చింది.