Working on Roses!

       

orange rose,10×12”,oils,2021

 ఈ మధ్యలో  నేను ఆరు వారాల పాటు జరిగిన Winter Roses Online Painting Workshop  లో చేరాను .UK కిచెందిన Artist ,Art teacher అయిన Paul Foxton శిక్షణ ఇచ్చారు . మామూలుగా

 మామూలుగా వివిధ రకాల పూలు పెయింట్  చేయడం కన్నా రోజా పూలు పెయింట్ చేయటం  అనేది చాలా తేడాగా అనిపించింది నాకు.  నాకు అనిపించిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నా ఇక్కడ .
 
  రోజా పూలు వేయాలంటే 
 
 – మొదట  డ్రాయింగ్  accurate గా వేసుకోవాలి . డ్రాయింగ్ సరిగ్గా లేకపోతే బొమ్మ ముందే రాదని  చెప్పచ్చు.  
 – లోకల్ కలర్ ని  జాగ్రత్తగా మ్యాచ్ చేయాలి 
 – values ని కరెక్టుగా నిర్వచించుకొని ,ఆ రంగులని  accurate గా కలుపుకోవాలి . values ని ముందు work చేయాలి .values ద్వారానే light and shadows ని గుర్తించగలం .
–  ఆ క్రమంలో రంగుల గాఢత(chroma ) తగ్గకుండా జాగ్రత్తపడాలి 
–  తర్వాతనే details కి పోవాలి . ఇందులో underpainting  ఆరనిచ్చి ఆరనిచ్చి మూడు లేక నాలుగు దఫాలుగా పని చేయాల్సి వచ్చింది నాకు .  
– . డీటెయిల్స్ ,high lights చివరి దఫా లో  చేయవచ్చు !
– అలానే రంగుల merging ,edges handling లో జాగ్రత్తపడాలి  !
 
 రోజాపూలు పెయింట్  చేయటంలో ఇంకా  నైపుణ్యం సాధించాలంటే నిబద్దతతో   చాలా ఏండ్లు దీని పైనే పని  చేయాలి అని అర్థమయ్యింది . 
 
 అలా రోజాపూల పైనే జీవితకాలం పనిచేస్తున్నకొద్ది మంది నాకు తెలిసిన  ఆర్టిస్టులు వీరు. Kathleen speranza, Katie g.whipple,Dennis perrin . వాళ్ళ వర్క్స్ చూస్తే ఎంత పని చేయాలో కదా  అనిపిస్తుంది.
 నేను వేసిన మరిన్ని రోజా పూల పెయింటింగ్స్ చూడటం కోసం మెనూ లోని roses పేజీకి వెళ్ళండి.  అభిప్రాయాలు తెలియచేస్తే సంతోషపడతాను ! మీకు ముందస్తు కృతజ్ఞతలు ! 
కింది లింక్ లో paul foxton రోజా పూవును పెయింటింగ్ చేస్తున్న వీడియో మీకోసం  .