బొమ్మలు వేయటం నేర్చుకోవటం అంటే సరిగ్గా చూడటం నేర్చుకోవడమే !
ఏ కళ కైనా basic fundamentals నేర్చుకోవడం చాలా ముఖ్యం . నేను portraits వేసేటప్పుడు చాలా రోజులు అనాటమీ ప్రాక్టీస్ చేసే దాన్ని. అలాగే city scapes వేసే టపుడు పర్స్పెక్టివ్ గురించి స్టడీ చేసాను. కలర్ గురించి నేర్చుకోవాలనుకున్నపుడు values , munsell color chartను ప్రాక్టీస్ చేసాను. ఇవన్నీ మళ్ళీ మళ్లీ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను.
బొమ్మలు వేయటం నేర్చుకోవటం అంటే సరిగ్గా చూడటం నేర్చుకోవడమే ! చూడటం అంటే accurate గా చూడటం. “Educate the eye before you educate the hand. The hand will become cunning soon enough when the eye has learned to see, whereas if the hand be educated before the eye one may never see.” -Carolus-Duran(1880)
బొమ్మలు వేసిన తర్వాత ఎక్కడ ఫోకస్ దెబ్బతినిందో చూసుకొని మల్లీ తిరిగి దానికి సంబందించిన అభ్యాసాల ద్వారా fit కావడం చెయ్యాలి . నిజానికి కొద్ధి మంది బయ్యర్స్ నేను ప్రాక్టీస్ చేసిన works ని అపురూపంగా కొన్నారు . అందులో వాళ్లకు ఎదో స్పార్క్ కనిపించింది.
చాలా జాగ్రత్తగా ,చాలా నెమ్మదిగా పని జరగాలి .లైన్ ఎలా వస్తోంది ఎలా పెరుగుతోంది అనేది గమనించాలి. force of will అనేది hand ని control చేయాలి . చేతికి కంటికి సరైన ట్రైనింగ్ ఇవ్వడమే అభ్యాసం అంటే . గ్రేట్ మాస్టర్ల డ్రాయింగ్స్ చూశారంటే quality and power of line కనిపిస్తుంది
ఏ రోజుకు ఆ రోజు చేసిన అభ్యాసాల పైన ఆ రోజు తేదీ వేస్తాను.వారం తర్వాత ఒకసారి చూసుకుంటాను అన్నీ కలిపి. నా లైను మొదటి రోజు కన్నా better గా అయ్యిందా లేదా అని .ఇలా చెక్ చేసుకోవటం అనేది చాల ముఖ్యం . వారం తర్వాత కూడా అలానే మొదటిరోజు గీసిన గీతలే వస్తున్నాయి అంటే “సరైన పద్దతిలో practice చేయటం” అనే దాని పైన ధ్యాస పెట్టలేదన్న మాట.
ముఖ్యంగా life నుంచి బొమ్మలు వేయాలి .ఏది వేయాలనిపిస్తే అది గీయటమే .ఏది మీ ముందర ఉంటె అది గీయచ్చు. కూరగాయలు, గిన్నెలు, పూలు ,ఆకులు,బట్టలు ఇలా ఎన్నో. చూడటం మొదలయితే సబ్జెక్టుకి కొరతే ఉండదు . స్కెచ్ లు వేయటం మొదలయితే ఆ దాహం తీరదు.
నేను అభ్యాసం చేస్తున్నవాటిలో Bargue ప్లేట్స్ ఇంకోటి. ఫ్రెంచ్ ఆర్టిస్ట్ Charles Bargue అనే అయన ఇంకో ఆర్టిస్ట్ Jean-Léon Gérôme తో కలిసి The Art Of Drawing అని 1868-1871లో క్లాసికల్ రియలిజం కి సంబంధించి ఒక గొప్ప డ్రాయింగ్ కోర్సు ని తయారుచేసాడు.197 ప్లేట్స్ ని చేశారు. వాటిని శాస్త్రీయ పద్దతిలో ప్రాక్టీస్ చేయాలి. వీటిని ప్రాక్టీస్ చేసిన వారిలో ప్రముఖ ఆర్టిస్టులు వాంగాగ్ , పికాసో కూడా ఉన్నారట .ఈ Bargue ప్లేట్స్ ని కాపీ చేయటం ఈ మధ్యనే మొదలు పెట్టాను. నేను ఇంకా మొదటి రెండు ప్లేట్స్ల నే చాలా రోజులుగా చేస్తున్నాను .చాలా నేర్చుకోవాలి . దీని కోసం నేను కొన్ని బ్లాగ్స్ పైన, youtube పైన ఆధారపడుతున్నాను. నమ్మకమైన online course దొరికితే చేరుతాను కూడా !
Bargueప్లేట్స్ గురించి ప్రముఖ చిత్రకారుడు చెప్పింది చూడండి. Van Gogh wrote to his younger brother, Theo, in 1881: ”Careful study and the constant & repeated copying of Bargue’s exercises have given me an insight into figure drawing. I have learned to measure and to see and to look for the broad outlines, so that, thank God, what seemed utterly impossible to me before is gradually becoming possible now. I no longer stand as helpless before nature as I used to do.”
Bargue drawing course అని గూగుల్ లో సెర్చ్ చేస్తే చాలా కొత్త sites కనిపిస్తాయి,ట్యుటోరియల్స్ ,కోర్సులు కనిపిస్తాయి . మళ్ళీ క్లాసిక్ రియలిజం ప్రాముఖ్యత పెరుగుతోంది అనేదానికి ఇది నిదర్శనం .
ఇంకో పుస్తకం An accurate eye By Darren Rousar ఈ మధ్యే తీసుకున్నా . అది కూడా మొదలుపెట్టాలి . ఇలా చాలా మంచి పుస్తకాలు ఉంటాయి .రకరకాల sources ద్వారా తెలుసుకొని చదవటం practice చేయటమే! ఇంటర్ నెట్లో , you tube లో కూడా చాలా సమాచారం దొరుకుతోంది.
బొమ్మలు వేయాలని ఆశ పడే వారికి ,ఎప్పుడో నిలిపివేసి మల్లీ మొదలుపెట్టాలనుకున్నవారికి, ఇంటినుంచే నేర్చుకోవాలని అనుకునే ఎంతో మంది స్త్రీలకు,సొంతంగా బొమ్మలు నేర్చుకునే ఔత్సాహిక ఆర్టిస్టులకు నేను చెప్పేది ఒకటే . Practice తో ఏదైనా సాధ్యం .సరైన పద్దతిలో సరైన అభ్యాసాలు చేయాలి అంతే ! తక్కువసమయం పెట్టుకొని ఒక చిన్న అబ్యాసం మొదలు పెట్టండి. పూర్తి ధ్యాసతో రోజూ చేయండి . మళ్ళీ మళ్ళీ అదే repeat చేయండి . మీ గీత మెరుగుపడిందా లేదా అని మొదటి అభ్యాసం చివరి అభ్యాసం తో పోల్చుకోండి .
కిందఇచ్చిన links లో గొప్ప ఆర్టిస్టులకు లైన్ పైన ఉండే కమాండ్ , google arts and culture సైట్ లో లైన్ ప్రాముఖ్యత గురించి, Bargue drawings వేసే విధానం గురించి కొంత సమాచారం ఉంది చూడండి
Learning to draw means learning to see
For any art one should learn basic fundamentals! When I am working on figure drawing I practice anatomy. When I am doing cityscapes I study perspective. When I am training on color, I do exercises on values and colours with the Munsell color chart. And I repeat these exercises.
Learning to draw means learning to see; and learning to see accurately. “Educate the eye before you educate the hand. The hand will become cunning soon enough when the eye has learned to see, whereas if the hand be educated before the eye one may never see.” — Carolus-Duran(1880) .
You should avoid the feeling that we can’t exhibit practice work. That we can’t show it the same way we would a finished drawing. For me, I am much more satisfied with practice work than a full painting because it makes me feel that I’ve received some food for the inner soul through lots of learning. Also, some buyers took my practice work — they found some spark in it.
After doing some art work one should identify which area needs to be improved, then practice that skill deliberately and get fit for another painting.
What I practice…
At present I am following the book by Arthur Wesley Dow — “Composition: Understanding Line, Notan and Color”. There are a lot of exercises in it... https://archive.org/
You can download it for free or you can buy at Amazon. I use it to do some exercises regularly. At present I am working through exercises on line and composition. I work with pencil, charcoal, and with ink. The line practice must go slowly and carefully as you observe how the line is coming and how the line is growing. Your hand should be controlled by force of will. Practice means giving training to hands and eyes. If you see great masters’ drawings you can find the quality and power of line.
Daily I put the date on my exercise papers, and after practicing for one week, I will check back and compare whether my line has improved or not. This type of checking is very important. If I am getting the same old lines it means I am not practicing deliberately!
The next book is “Freehand Drawing: A Primer” by Philip Thiel. He suggests to practice from life. Draw anything and everything — draw whatever is in front of you. Learn to look, there are wonderful drawing ideas all around you, just waiting to be sketched. Find interesting objects to draw and work from life.Boxes, rope, wire, chairs, hands, hand tools, shoes, flowers, leaves, branches, still life, etc.
Another practice work is to copy Bargue plates.
Charles Bargue designed the Cours de Dessin, published between 1866 and 1871 in collaboration with Jean-Léon Gérôme. It is one of the most influential classical drawing courses and consists of 197 lithographs printed on individual sheets that describe a learning process that begins with the study of the drawings of the great masters, continues with the copying of plaster casts, and concludes with the drawing of the human figure from nature.
I just started first two plates. I am still learning. I found these exercises on some blogs and YouTube. And if I find any reliable online course I want to join it.
Famous artist Van Gogh wrote to his younger brother, Theo, in 1881: ”Careful study and the constant and repeated copying of Bargue’s exercises have given me an insight into figure drawing. I have learned to measure and to see and to look for the broad outlines, so that, thank God, what seemed utterly impossible to me before is gradually becoming possible now. I no longer stand as helpless before nature as I used to do.”
If you search in Google you will find a lot of sites and tutorials on this, so it’s a sign that the significance of classic realism is growing !
Recently I bought the book “An Accurate Eye” By Darren Rousar. I want to start this also. There are so many good books and resources for drawing practice. Find them through reliable sources and start practicing!
My advice for the people who want to draw, self-taught artists, and women who want to work and learn from home, for those who want to draw again after long gap and for emerging artists is that anything can be possible with practice. Just do it. Take very limited time, start small, do it with focus, repeat the same exercise, check whether your line has improved or not. Again, go for it.
I have given some links below about the command of line by the masters, line importance in the site of Google arts and culture, practicing Bargue drawings etc.
కిరణ్కూమారి గార్కి,
అభినందనలు.
మీ యీ ప్రయత్నం చాలామంది ఔత్సాహిక ఆర్టిస్ట్లకు యెంతో వుపయోగపడుతుంది.
Thanksandee !
చాలా మంచి ప్రయత్నమండి.. కొత్త ఉత్సాహం వస్తోంది. మళ్లీ గీయడానికి ప్రయత్నిస్తాను.. https://openlibrary.org/ లోనూ చక్కని పుస్తకాలు ఉన్నాయి. రెంట్ కి ఇస్తారు..
మోహన్ గారు ,
తప్పకుండా మొదలుపెట్టండి. నాకు మీ వర్క్ చాలా బాగా గుర్తుంది.ఎంత గాఢత ఉందో . ఫ్రెష్ గా ఉండేవి .చదివి జవాబిచ్చినందుకు చాలా కృతజ్ఞతలు ! open library లింక్ ఇచ్చినందుకు సంతోషమండీ !
Chala informative ga vundi. Meelaga opikaga practice cheyyagalanaa ani doubt. Budding artists ki chala useful. Thank you kiran
thank you Madam!