Value balance లేక value relationship ను అర్థం చేసుకోటానికి ఆర్టిస్టులు Cubes ,spheres ను ఉపయోగించి అనేక అభ్యాసాలు చేస్తారు . నేను కూడా అదే చేసాను .
ఇక్కడ నేను white ,gray , black లో cubes ,spheres తీసుకున్నాను . (బజార్లో అమ్మే చౌకగా దొరికే ప్లాస్టిక్ బాల్స్ కి తెలుపు, నలుపు, గ్రే రంగులు వేసుకున్నా.చెక్కపని చేసేవాళ్ళనడిగి రెండు ఇంచుల పొడవు వెడల్పు కల cubes ని చెక్కతో చేయించుకున్నా. ఆర్ట్ మెటీరియల్ అమ్మే షాప్ లలో కూడా అడగచ్చు )
వెనుక అంటే బ్యాక్ గ్రౌండ్ నలుపు రంగులో ,కింద అంటే బేస్ grey రంగు లో( ఆ రంగు వేసిన అట్టలు ) అమర్చుకొని ఈ spheres ని,cubes ని ఆయిల్స్ తో పెయింట్ చేసాను .
మామూలుగా cubes ,sphere యొక్క values ని అర్థం చేసుకోవాలంటే light ఎలా పడుతోందో గమనించాలి . అలాచూసినపుడు light values ,mid tone values,shadow values కనిపిస్తాయి .
అవి cube లో
light side
topsurface
shadowside
cast shadow
అవి sphere లో
High light,
Center light ,
Half tone,
Core shadow,
Cast shadow ,
Reflected light ,
Occlusion shadow గా చెప్పుకుంటాము .
వీటిని కరెక్టుగా value scale ఆధారంగా రంగులు కలపటం ఒక ఎత్తు అయితే వాటిని సరిగ్గా పక్కపక్కనే ఆ values కనిపించేటట్టు పెయింట్ చేయడం ,అలాగే ఒక value నుంచి ఇంకో value కి మారేటపుడు జాగ్రత్తగా merge చేయడం చేయాలి . ఇది అర్థమయిన తరువాత రంగులలో కూడా ఈ values ని అర్థం చేసుకోవాలి .
ఇది క్రమశిక్షణ తో కూడిన అభ్యాసం పైనే వస్తుంది .
ఆలా value balance ,Value relationship ని study చేసి బొమ్మ వేసినపుడు అది ఒక మంచి బొమ్మగా నిలబడుతుంది .
ఈ అభ్యాసాలు సరిగ్గా చేయగలిగితే stilllife , potraits ,landscape paintings సులభమవుతాయి