నేను నేర్చుకొనే ఉపయోగపడే కొన్ని websites !
మనకు కావాల్సిన అంశాలపై ఉచితంగా సమాచారాన్నిఇచ్చే, గైడ్ చేసే అనేక site లు internet లో దొరుకుతాయి . కాకపోతే సరైన,ఖచ్చితమైన సమాచారం ఇచ్చే వాళ్లై ఉండాలి . అందుకని కొద్ధి మంది నమ్మకమున్న ఆర్టిస్టులు ,రచయితలు,స్నేహితు లు చెప్పిన site లను చూడడం, నాకు అనుకూలంగా ,ఆసక్తి గా ,ఉపయోగంగా ఉన్న వాటిని కంటిన్యూ చేయడం చేస్తాను ,అలా చాలా రోజులుగా నేను ఫాలో అవుతున్న వాటిని మీకు కూడా పరిచయం చేస్తాను
నేను ఫాలో అయ్యే కొన్నిART sites
by Paul foxton
లండన్ కి చెందినPaulfoxton selfthought artist,Art teacher కూడా ! నేను పదేండ్ల నుంచి చూస్తున్నాను . up to date గా ఉండడం,ముక్కుసూటిగా ఉండటం ,మంచి వర్క్ ని మాత్రమే సపోర్ట్ చేయడం , ఆర్ట్ పట్ల , చేసే పని పట్ల నిబద్దత, నిజాయితీ,ప్రతి చిన్న సమాచారాన్నీ పంచుకోవటంతో మంచి గురువు అనిపించుకున్నాడు . ఆయన దగ్గర నేను మాస్టరింగ్ కలర్ కోర్సు చేసాను . చాలా నేర్చుకున్నాను ఆ కోర్సు తో .ఇప్పుడు winter roses online workshop లో చేరాను . రోజా పూలు వేయటం కష్టం నాకు అదినేర్చుకోవటంతో పాటు లూస్ గా బ్రష్ హేండిల్ చేయటం కూడా నేర్చుకోవాలి . ఆయన బ్లాగ్లో తన ఆలోచనలు ,తన వర్క్ ఏదీ దాచుకోకుండా పంచుకుంటారు . ఆయన వ్యక్తిత్వం కూడా మనల్ని చాలా ప్రభావితం చేస్తుంది. పైన ఇచ్చిన లింక్ లో ఆయన రాతలు , పని చూడచ్చు . ఆర్ట్ వర్కుషాప్స్ నిర్వహిస్తుంటారు
by Darren R.Rousar
ఇతని దగ్గర నేను మెమరీ డ్రాయింగ్ కోర్స్ చేస్తున్నాను .ఒక సారి ఆ కోర్స్ లో ప్రవేశిస్తే మన ఓపికను బట్టి ఎన్ని రోజులైనా ఆ అభ్యాసాలు చేసుకోవచ్చు . ఆ అభ్యాసాలు చూస్తే వాళ్ళు ఎంత scientific గా ఆలోచిస్తారో ,ఎంత పని చేస్తారో అనిపిస్తుంది .ప్రతి వారం ఆర్ట్ కి సంబంధించి ఎదో ఒక అంశంపై ఆర్టికల్ రాస్తారు .ప్రతి గురువారం ఆగకుండా ఆ వ్యాసాలు వస్తుంటాయి .పైన లింక్ లో ఆయన వ్యాసాలు ,ఆయన ట్యుటోరియల్స్ చూడవచ్చు .
by Anthony Waichulis
ఈయన ఆర్ట్ అకాడెమీలు నడుపుతున్నాడు . ఈయన తయారు చేసిన ఆర్ట్ సిలబస్ పిల్లలకోసం ఉచితంగా ఇస్తున్నా రు . కాకపోతే ఆ సిలబస్ పిల్లలకే కాదు ఆర్టిస్టులకందరికీ పనికొస్తుంది . ఆర్ట్ టీచర్స్ అది నేర్చుకొని పిల్లలకు నేర్పించాలి . ఈయన సిలబస్ లో పెట్టిన అభ్యాసాలు నేను ప్రింట్ తీసుకొని అభ్యాసం చేస్తుంటాను . కింది లింక్ లో ఆ సిలబస్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసువుకోవచ్చు .
4. https://
ఇంటర్నెట్ వచ్చిన తరువాత చాలా ఫ్రీ మెటీరియల్ దొరుకుతోంది . చాలా మంది ఆర్టిస్టులు ఉదారంగానే సమాచారాన్ని పంచుకుంటున్నారు . పైన ఇచ్చిన సైట్ లో goodies లోకి పోతే చాలా ఫ్రీ మెటీరియల్ ,వీడియోస్ దొరుకుతాయి .
ఆలోచన కి సంబంధించి నేను అనుసరించే మరికొన్ని sites
Zen habits by Leo Babauta
జెన్ habits వారానికి ఒక ఆర్టికల్ చొప్పున వస్తుంది. అది నేను చదివి ఆలోచించటం,కాస్త పాటించటం చేస్తుంటాను .మనం ఆలోచించే తీరు ను చెక్ చేసుకోవచ్చు . అలాగే ఆయన ముఖ్యమైన కొన్నిఅంశాలపై కోర్స్ లు కూడా ఇస్తుంటారు .subscribe చేస్తే మీ మెయిల్ కి వారానికి ఒక ఉచిత వ్యాసం వస్తుంది . ఆర్కైవ్ లో కూడా మంచి ఆర్టికల్స్ ఉంటాయి .
by James clear
జేమ్స్ క్లియర్ ఆటోమేటిక్ హాబిట్స్ అన్న పుస్తకం చాలా ఖ్యాతి పొందింది . నేను వారం వారం వచ్చే ఆయన newsletter ఫాలో అవుతాను .ఇది కూడా subscribe చేస్తే మీ మైల్ కు న్యూస్ లెటర్ వస్తుంది .
ఈ head space మెడిటేషన్ కి సంబంధించింది . రోజూ ఒక పది నిమిషాలు ఉచితంగా గైడ్ చేసే వీడియోను పెట్టుకొని నేను మెడిటేషన్ చేసుకుంటాను .మెడిటేషన్ seriousa గా చేసే వాళ్ళు డబ్బులు కట్టి ఇంకా లోతుగా నేర్చుకుంటారు . సైట్ లోకి పోయి చూస్తే అర్థమవుతుంది .
ఇది చదివే వాళ్ళకి ముందస్తు కృతఙఞతలు !
అలానే కొత్త పెయింటింగ్స్ స్టిల్ లైఫ్ గాలరీ లో పెట్టాను . కొనడానికి ఆసక్తి ఉన్నవాళ్లు మెయిల్ ద్వారాసంప్రదించండి .(bkiran38@gmail.com)
అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు!
Mask wearing and social distancing కంటిన్యూ చేద్దాం .
సురక్షితంగా ఉందాం!
ఇట్లు ,
కిరణ్ కుమారి
2021
మీ పోస్ట్ చిత్రకారులందరికీ చాలా ఉపయోగకరం! ఇలా పంచుకోవాలనుకోవడం మీ సహృదయాన్ని తెలియజేస్తోంది.