plein air పెయింటింగ్
దివ్యారామం లో ఈ రోజు plein air పెయింటింగ్ చేసాను. స్టూడియో నుంచి బయటకొచ్చిసహజమైన కాంతిలో బొమ్మలు వేయటమే plein air పెయింటింగ్ అంటే !( Plein air painting is about leaving the four walls of your studio behind and experiencing painting and drawing in the landscape)
ఐదారు సంవత్సరాల నుంచి వారానికి ఒక రోజు బయట పోయి వేయాలన్న రూల్ పెట్టుకొన్నాను.నేను ఒక అట్టకి కొన్నిహ్యాండ్ మేడ్ పేపర్లు కాని,కెన్సన్ పేపర్లు కానీ పెట్టుకుంటాను. వాటిలో వేస్తాను.ఒక్కొక సారి స్కెచ్ బుక్లో కూడా వేస్తుంటాను.water color papers తో చాల కంపెనీల sketch books వచ్చాయి. లేదంటే సెపరేటేగా పేపర్లు కొని వాడుకోవచ్చు.నేను బెంగళూరులోభాస్కర ఆర్ట్ సెంటర్లో ఎక్కువ కొంటుంటాను.ఏదన్న ఆర్ట్ మెటీరియల్ కావాలని వాళ్లకి వాట్సాప్ చేస్తే ఇంటికి పోస్ట్ కూడా చేస్తా
రు. అట్లే water colour cakes బాక్స్ లని తీసుకెళ్తాను లేదంటే water colours ని ట్యూబ్ ల నుంచి కొద్దీ కొద్దిగా pallet లో వేసుకుంటాను.కాస్సేపటికి అది ఆరి గట్టి అవుతుంది .మొదట స్టూడెంట్ watercolors తో practice అయిన తర్వాత ప్రొఫెషనల్ కలర్స్ కొనచ్చు.ఒక నీళ్ళసీసా ,ఒక గ్లాస్ ,కొన్ని బ్రష్ లు రౌండ్ వి ఫ్లాట్ వి,pencils&penలు ఉన్నkit తీసుకొని పోతాను.చెట్లల్లో పురుగులు దోమలు ఉంటాయి కనుక దాని కోసం కూడా ఏదన్నా క్రీములు రాసుకోవటం, శరీరాన్ని పూర్తి గా కవర్ చేసే బట్టలు వేసుకోవటం ఉంటుంది. సరైన స్థలం చూసుకొని కూర్చున్నాక Sketch వేసుకొని Compose చేసుకోవటం,పెయింట్ చేయటం మొదలు పెడతా. ఒక్కొక్కసారి చిన్న చిన్న స్టడీస్ చేస్తుంటా.రెండు నుంచి మూడు గంటల్లో పెయింటింగ్ పూర్తి అవుతుంది.


- వారానికి ఒకసారి గ్రూపుగా కానీ ఒక్కరుగా కానీ ఎలా వీలయితే అలా బయట Plein Air paintings అభ్యాసం చేస్తే light గురించి అర్థమవుతుంది .
- మనకు బాగా నచ్చి వేయాలనుకున్నspot ను మొదట ఎంచు కోవాలి
- View finders ద్వారా compose చేసుకోవాలి
- బొమ్మ సరిగ్గా రాక పోయినా పర్వాలేదు.బయట వెళ్ళటం, బొమ్మ వేయటానికి ప్రయత్నించటం మొదటి అడుగు!