My Plein Air Work

             plein air పెయింటింగ్

     దివ్యారామం లో ఈ రోజు plein air పెయింటింగ్ చేసాను. స్టూడియో నుంచి బయటకొచ్చిసహజమైన కాంతిలో బొమ్మలు వేయటమే plein air పెయింటింగ్ అంటే !( Plein air painting is about leaving the four walls of your studio behind and experiencing painting and drawing in the landscape)

           ఐదారు సంవత్సరాల నుంచి వారానికి ఒక రోజు బయట పోయి వేయాలన్న రూల్ పెట్టుకొన్నాను.నేను ఒక అట్టకి కొన్నిహ్యాండ్ మేడ్ పేపర్లు కాని,కెన్సన్ పేపర్లు కానీ పెట్టుకుంటాను. వాటిలో వేస్తాను.ఒక్కొక సారి స్కెచ్ బుక్లో కూడా వేస్తుంటాను.water color papers తో చాల కంపెనీల sketch books వచ్చాయి. లేదంటే సెపరేటేగా పేపర్లు కొని వాడుకోవచ్చు.నేను బెంగళూరులోభాస్కర ఆర్ట్ సెంటర్లో ఎక్కువ కొంటుంటాను.ఏదన్న ఆర్ట్ మెటీరియల్ కావాలని వాళ్లకి వాట్సాప్ చేస్తే ఇంటికి  పోస్ట్ కూడా చేస్తారు. అట్లే water colour cakes బాక్స్ లని తీసుకెళ్తాను లేదంటే water colours ని ట్యూబ్ ల నుంచి కొద్దీ కొద్దిగా pallet లో వేసుకుంటాను.కాస్సేపటికి అది ఆరి గట్టి అవుతుంది .మొదట స్టూడెంట్ watercolors తో practice అయిన తర్వాత ప్రొఫెషనల్ కలర్స్ కొనచ్చు.ఒక నీళ్ళసీసా ,ఒక గ్లాస్ ,కొన్ని బ్రష్ లు రౌండ్ వి ఫ్లాట్ వి,pencils&penలు ఉన్నkit తీసుకొని పోతాను.చెట్లల్లో పురుగులు దోమలు ఉంటాయి కనుక దాని కోసం కూడా ఏదన్నా క్రీములు రాసుకోవటం, శరీరాన్ని పూర్తి గా కవర్ చేసే బట్టలు వేసుకోవటం ఉంటుంది. సరైన స్థలం చూసుకొని కూర్చున్నాక Sketch వేసుకొని Compose చేసుకోవటం,పెయింట్ చేయటం మొదలు పెడతా. ఒక్కొక్కసారి చిన్న చిన్న స్టడీస్ చేస్తుంటా.రెండు నుంచి మూడు గంటల్లో పెయింటింగ్ పూర్తి అవుతుంది.

           బెంగుళూరు లో Pencil Jammers అన్నపేరుతో ప్రతి ఆదివారము ఆర్టిస్టులు కలిసి ఒక్కొక్క వారం ఒక్కొక్క స్థలం ఎన్నుకొని కల్సి బొమ్మలు వేసుకుంటారు.  అలానే ,చెన్నయ్ లో Chennai weekend artists(CWA)h)https://www.facebook.com/groups/ChennaiWeekendArtists/ పేరుతో ఉన్నఈ సంస్థలో ఆర్టిస్టులు ప్రతి ఆదివారం కలిసి బొమ్మలు వేయటాన్ని ఒక అలవాటుగా మార్చుకొని ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు . సంవత్సరం పాటు వేసిన బొమ్మల్ని  చివర్లో ప్రదర్శిస్తారు .వీరు చెన్నై లో కవర్ చేయని స్థలమంటూ లేదోమో .నేను చెన్నై(CWA) వాళ్ళతో ,బెంగుళూరు pencil jammersతో కలిసి కొన్ని సార్లు వర్క్ చేసాను . హైద్రాబాద్ లో విజయవాడలో కూడా ఇలాంటి ఆర్టిస్ట్ గ్రూప్స్ ఉన్నట్టు విన్నాను. ఇక దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా అయితే బోలెడన్ని ఉండాయి .
  • వారానికి ఒకసారి గ్రూపుగా కానీ ఒక్కరుగా కానీ ఎలా వీలయితే అలా బయట Plein Air paintings అభ్యాసం చేస్తే light గురించి అర్థమవుతుంది .
  • మనకు  బాగా నచ్చి వేయాలనుకున్నspot ను మొదట ఎంచు కోవాలి
  • View  finders ద్వారా compose చేసుకోవాలి
  • బొమ్మ సరిగ్గా రాక పోయినా పర్వాలేదు.బయట వెళ్ళటం, బొమ్మ వేయటానికి ప్రయత్నించటం మొదటి అడుగు!

3 thoughts on “My Plein Air Work”

  1. Very nice. Beautiful paintings. Thanks for sharing your experience and guidance to other painters. If everyone shares their experiences, the world of art will evolve to a higher level.

Comments are closed.