Yellow Chrysanthemums – still life

చిట్టి చేమంతులు – still life, oils, 6×8″

ఒక రోజు సాయంత్రం ఈ పసుపు చేమంతి పూలు నాకు దొరికాయి . వీటిని చిట్టి చేమంతులు అని కూడా అంటాము మేము . తోటగల్లోళ్లు ఎండి పోయిన,వాడిపోయిన వాటిని పీకి పారేశారు , కాకపోతే అందులో పచ్చగా ఉన్న చేమంతులు కూడా ఉన్నాయి. నాకు పచ్చనిధి దొరికినంత సంబరంతో అన్ని పూలనీ తెచ్చేసుకున్నా. ఎండిన పూలను ఒక సీసా లో దోపాను.  పచ్చగా ఉన్న పూలను, పసుపుపూర్తిగా వదలని వాడిన పూలను గాజు సీసాలో నీళ్ళుపోసి పెట్టా .

ఇక దాన్ని ఒక ఫ్రేమ్ లో చూసుకోవటం మొదలు పెట్టి అలా సర్ది ఇలా సర్ది వెనుక back ground రంగులు అలా మార్చి ఇలా మార్చి చూసుకున్నా.         ఇదంతా బొమ్మ వేయాలన్న ప్రయతంతో మాత్రం కాదు.చాలా సార్లు దొరికిన subject ని చాల సేపు అలా compose చేసుకొంటూ ఉంటాను . వేయాలనుకుంటే వేస్తాను .లేదంటే ఆలా composition ల తోనే సరిపెడుతుంటా .    
         నేను still life paintings ని మొదలు పెట్టానంటే  ఒకరోజు కంపోజ్ చేసుకోవడం ,పెయింట్ చేయడానికి కాన్వాస్ బోర్డుని సిద్ధం చేసుకోవడం ,రంగులు ఏమేమి కావాలి అనేది సిద్ధం చేసుకుంటా . రెండో రోజు ఆ సబ్జెక్టుని పెయింట్ చేయడం మొదలవుతుంది. ఒకే సారి పూర్తి  చేస్తాను . ఐదారు గంటలు పడుతుంది . ఇక మూడో రోజు సరి చూసుకోవడం ,చిన్న చిన్న adjustments  చేయటం జరుగుతుంది.Daylight లో వర్క్ చేస్తాను కనుక పొద్దున్న7గంటలనుండి12గంటలమధ్య పనిజరుగుతుంది.వేయడానికి సమయాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అందుకని రంగులు మితంగా , subject వాడిపోవడం ,లేక మారి పోవడం ఉండకుండా చూసుకోవాలి . ఈ పూలు ఇంకా రెండు రోజులు తాజాగా ఉంటాయన్న నమ్మకం తో పని మొదలు పెట్టాను
          ఈ పెయింటింగ్ కోసం LemonYellow ,CadmiumYellow, Yellow Ochre , Raw sienna ,Raw Umber ,Cadmium Red Hue ,Ivory Black,Titanium white తీసుకున్నాను . మీడియం winsor &newton  వారి oil color medium liquin  వాడుతున్నా . oilcolours Winsor &Newton కంపెనీవి మరి కొన్ని Camel వి కూడా వాడాను . స్టిల్ లైఫ్ పెయింటింగ్ చేసేటపుడు నేను site size method,munsell కలర్ పద్దతిని వాడుతాను . ముందు ముందు వీటిని ఇంకాస్త వివరంగా  చెబుతాను .  

  • వాడిపోని పాడయిపోని సబ్జెక్టు ను ఎన్నుకోవాలి
  • daylight బాగా వచ్చే చోట సబ్జెక్టుని పెట్టుకోవాలి(ఉదాహరణకు కిటికీ పక్క కానీ తలుపు పక్క కాని)
  • దాన్ని interesting గా compose చేసుకోవాలి
  • ground ,background  colors  ని కూడా సెట్ చేసుకోవాలి
  • డ్రాయింగ్ accurate గా ఉండాలి
  • అలానే accurate colors కలుపుకొని పెయింట్ చేయాలి