Value scale
నేను తెలుసుకున్నvalue study గురించి ఇక్కడ కొద్ధి మేరకు చెబుతాను.
మాములుగా Hue ,Value ,Chroma గురించి కొంత అర్థం చేసుకోవాలి .
The Hueఅంటే రంగుపేరు ,నీలిరంగు,ఎరుపురంగు,పసుపురంగు ఇలా.
The Value అంటే ఎంత dark గా ఉంది ఎంత light గా ఉంది ఆ రంగు అనేది.
The Chroma అంటే ఆ రంగు ఎంత బలంగా ప్రభావితంగా ఉంది ఎంత బలహీనంగా ఉంది అంటే intensity of color గురించి చెప్పటం. A low intensity రంగు అంటే grey కి దగ్గరగా ఉండటం,neutral కి దగ్గరగా ఉండటం A high intensity color అంటే చాల strong గా pure గా ఉండటం .
రియలిస్టిక్ బొమ్మలు వేసేటప్పుడు valuesని సరిగ్గా వేయడంలోనే తప్పులు ఎక్కువ జరుగుతుంటాయి.ఒక బొమ్మలో అంటే portraits కానీ ,landscapes కానీ వేసేటప్పుడు depth ని ,three dimensionality ని తీసుకురావాలంటే values ద్వారానే సాధ్యపడుతుంది . మాస్టర్ ఆర్టిస్టులు వాళ్ళ చూపు ,focus మెరుగు పరుచుకోటానికి ఈ అభ్యాసాన్నిమధ్య మధ్యలో చేస్తూనే ఉంటారు .
నేను కూడా చాలా రోజులు దీన్ని అర్థం చేసుకోను కష్టపడ్డాను . valuesని అర్థం చేసుకోను ఫండమెంటల్స్ దగ్గరనుంచి ప్రాక్టీస్ చేయాలి. white నుంచి black వరకు ఉన్నvalues ని చూడగలగాలి .అంటే light to dark మధ్యలో ఉన్నషేడ్స్ ని చూడటం . మొదట పెన్సిల్తో value scale ని ప్రాక్టీస్ చేయాలి. Value scale ఒక క్రమ పద్దతిలోvalues ని అంటే shades ని చూడటం నేర్పిస్తుంది . రంగులతో బొమ్మలు వేసేటపుడు ఈ స్టడీ ఎంతగానో ఉపయోగ పడుతుంది .
మొదట మూడు values అంటే black ,mid gray ,white ని ప్రాక్టీస్ చేయాలి . తర్వాత ఐదు values ,తర్వాత తొమ్మిది values చేయాలి. ఇది చాలా simple గా కనిపిస్తుంది. కానీ చాలా ధ్యానంతో నెమ్మదిగా కావాలంటే రోజుకు ఒక block మాత్రమే నింపుతూ పని చేయాలి .హడావుడిగా speed గా చేయకూడదు texture లు లేకుండా smooth గా టోన్ ఉండాలి . అప్పుడే ప్రతి step లో values ని కరెక్ట్ గా అంచనా వేయగలము , soft pencil 2B, hard pencil 2h తో కానీ , 6B,B,H,3H పెన్సిళ్ళతో కానీ పని చేయచ్చు. శ్రద్ద ,నేర్చుకోవాలన్న తపన ఉంటే రకరకాల పెన్సిళ్ళతో ,ఇతర mediums తో కూడా ఈ అభ్యాసం చేయ వచ్చు .
బొమ్మల విషయంలో మనం చూసే చూపు మారాలన్నా ,focus దెబ్బ తిన్నా మళ్ళీ మళ్ళీ ఈ అభ్యాసంచేయాల్సి ఉంటుంది . కింద ఇచ్చిన కొన్ని లింక్స్ లో ఈ ఎక్సరసైజ్ ఎలా చేస్తారో చూడచ్చు .