My journey with school children-2

 

స్కూలు పిల్లలతో నా అనుభవాలు – 2

గతవిద్యా సంవత్సరం “పిల్లలతో కథల-బొమ్మల ప్రయాణం”అనుభవాలు పంచుకున్నాను . 

(చూడని వారు పిల్లలతో నా ప్రయాణం లో చదవచ్చు )
 
              ఈ విద్యా  సంవత్సరంలో కూడా  స్కూల్ పిల్లలకు కథలు చెప్పటం,బొమ్మలు వేయించడం తో పాటు  పిల్లల కథల పుస్తకాల సేకరణపై   దృష్టి పెట్టాను . 

Continue reading “My journey with school children-2”

About oil painting brushes

పెయింట్ బ్రష్ లు – కథాకమీషు
 
   Click for English version#A while ago
        చాలా సార్లు కొన్ని పెయింటింగ్స్  చూడగానే మంచి బ్రష్ లు వీళ్ళు వాడలేదు అని తెలిసిపోతుంది . బ్రష్ ల గురించి కాస్త అవగాహన ఉండటం, ఎలాంటి వర్క్ కి ఏ రకం బ్రష్ ఉపయోగపడుతుందో గ్రహించటం ముఖ్యం . Oil paint బ్రష్ ల గురించి నెట్లో చదివినవి  ,ఆర్టిస్ట్ group ల చర్చల నుంచి అప్పుడప్పుడు  నేను రాసుకున్న నోట్స్ ని మీతో పంచుకుంటున్నా !
పెయింట్ బ్రష్ లను  మూడు భాగాలుగా చూడచ్చు !

Continue reading “About oil painting brushes”

Still life art work in oils-Pears

    
    Pears,6×8 inches,Oils on paper
                  
                 దాదాపు మూడు నెలల నుంచి నేను ఏ పోస్ట్ పెట్టలేదు . ఊర్లో లేకపోవటం ఒక కారణమైతే కొన్ని నెలలు ప్రాక్టీస్ వదిలామంటే మల్లీ మొదలు పెట్టను చాలా సమయం తీసుకుంటుంది . ఒక క్రమ పద్దతిలో పనిచేయను మనసు శరీరాలు తొందరగా ఒప్పుకోవు . మొదట రోజూ కొన్ని డ్రాయింగ్ అభ్యాసాలు చేయటం,సంబంధిత వీడియోలు చూడటం ,నేను అనుసరించే ఆర్ట్ బ్లాగ్స్ చదవటం చేసాను.అంతే కాక పెయింటింగ్ మొదలు పెట్టటానికి ఎప్పుడూ ధైర్యం సరిపోదు. సరిగ్గా రాక మధ్యలో ఆపేస్తానేమోనన్న సందిగ్ధంతో సబ్జెక్టును తెచ్చుకోటం ,compose చేసుకోవటం జరుగుతూ ఉంటుంది . అలా బజారుకి పోయినపుడు బొమ్మ వేయటానికి తెచ్చుకున్న బేరి కాయలు (Pears)ఇవి .
                పని మొదలు పెట్టాను.వేసేటపుడు వర్షం కారణంగా daylight డల్ అయ్యింది.ఆ పండు texture,sharp edges తేవటానికి కష్టపడాల్సి వచ్చింది. 

My journey with school children! Art&story telling to children

పిల్లలతో కథల – బొమ్మల ప్రయాణం – 1

Click here to English version

                 నా మనవరాలికి కథలు చెప్పేదాన్ని.ఈ కథలు వేరే పిల్లలకు కూడా చెబితే బాగుంటుంది కదా అని మా ఇంటి వెనుక ఉండే మున్సిపల్ స్కూల్కి వెళ్లి పిల్లలకు కథలు చెబుతాను వారానికి ఒక గంట టైం ఇవ్వండి అని అడిగాను .అక్కడి హెల్డ్మాస్టర్ మొదట పై అధికారుల పర్మిషన్ లు కావాలి మళ్ళీ రండని పంపించివేశారు. సరే ఇలా కాదు అని కథలు వినడం వల్ల కలిగే ప్రయోజనాలు,ఎలాంటి కథలు చెప్పాలనుకుంటున్నాను అనే విషయాలు వివరంగా రాసి ఒక అప్లికేషన్ లా , నా బయోడేటాని చేర్చి మల్లీ పోయి ఇచ్చాను. దాంతో ఏమనుకున్నాడో ఏమో సరే అనేశాడు . అక్కడి నుంచి కథలు మొదలయ్యాయి . Continue reading “My journey with school children! Art&story telling to children”

learning to draw means learning to see!

shirts

Click here  to English version

బొమ్మలు వేయటం నేర్చుకోవటం అంటే సరిగ్గా చూడటం నేర్చుకోవడమే !

ఏ కళ కైనా basic fundamentals నేర్చుకోవడం చాలా ముఖ్యం . నేను portraits వేసేటప్పుడు చాలా రోజులు అనాటమీ ప్రాక్టీస్ చేసే దాన్ని. అలాగే city scapes  వేసే టపుడు పర్స్పెక్టివ్ గురించి స్టడీ చేసాను. కలర్ గురించి నేర్చుకోవాలనుకున్నపుడు values , munsell color chartను ప్రాక్టీస్ చేసాను. ఇవన్నీ మళ్ళీ మళ్లీ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను.

బొమ్మలు  వేయటం నేర్చుకోవటం అంటే సరిగ్గా చూడటం నేర్చుకోవడమే  ! చూడటం అంటే accurate గా చూడటం. “Educate the eye before you educate the hand. The hand will become cunning soon enough when the eye has learned to see, whereas if the hand be educated before the eye one may never see.” -Carolus-Duran(1880)

Continue reading “learning to draw means learning to see!”